Mon Dec 23 2024 11:11:29 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : OG మూవీ నుంచి డివివి నిర్మాతలు తప్పుకుంటున్నారా..?
పవన్ కళ్యాణ్ OG నిర్మాణ భాద్యతలను డివివి బ్యానర్ వదులుకుంటుందా..?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్ లో 'OG' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో 90's బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. పవన్ నుంచి ఇలాంటి కథలు కోరుకునే అభిమానులు.. పవన్ ని గ్యాంగ్ స్టార్ గా చూసి చాలా కాలం అయ్యింది. పంజా తరువాత మళ్ళీ పవన్ అలాంటి పవర్ ఫుల్ పాత్రని పోషించలేదు. దీంతో OGలో పవన్ అలాంటి ఒక పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడని తెలిసి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
దీంతో ఈ చిత్రాన్ని డివివి నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మించడం సాగింది. ఒక పక్క శరవేగంగా షూటింగ్ జరుపుతూనే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులకు తెలియజేస్తూ డివివి నిర్మాతలు ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ నుంచి డివివి బ్యానర్ తప్పుకుంటుందంటూ వార్తలు వస్తున్నాయి. OG నిర్మాణ భాద్యతలు డివివి నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరోబోతున్నాయంటూ గుసగుసలు వినిపించాయి.
ఇక ఈ వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఆందళోన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. ఇక ఈ వార్తలు గురించి కొందరు విలేకర్లు డివివి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ ని ప్రశ్నించగా.. వాటిలో నిజం లేదని తేలింది. OG సినిమాని తాము వదులుకోవడం లేదని, ఈవారం కూడా మూవీకి సంబంధించిన ఓ మీటింగ్ జరిగినట్లు వెల్లడించారట. ఈ ఫేక్ వార్తలకు చెక్ పెట్టడానికి డివివి నిర్మాతలు ఓ అప్డేట్ ని కూడా సిద్ధం చేస్తున్నారట. మరి అది పండుగ సమయంలో వస్తుందేమో చూడాలి.
కాగా ఏపీ ఎన్నికలు అయ్యేవరకు ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కేదిలేదు. అంటే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు నో షూటింగ్. ఈ చిత్రం ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్గా నటిస్తుంటే తమిళ నటులు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
Next Story