Fri Apr 04 2025 14:49:01 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పవన్ పొలిటికల్ ప్రమోషన్స్..
పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ప్రమోషన్స్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పవర్ఫుల్ ప్రోమోని సిద్ధం చేస్తున్నారు.

గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలిసి చేస్తున్న రెండో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యి కేవలం ఐదు రోజులు షూటింగ్ మాత్రమే జరుపుకుంది. పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఎలక్షన్స్ అయ్యేవరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాదని ఆడియన్స్ భావించారు.
కానీ సడన్గా మూవీ టీం నుంచి ఒక సర్ప్రైజ్ అప్డేట్ వచ్చింది. 'ఊహించినది ఊహించండి' అంటూ చిత్ర నిర్మాతలు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ట్వీట్ చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ డబ్బింగ్ వర్క్స్ గ్లింప్స్ కి సంబంధించినవని సమాచారం. పవన్ తన పొలిటికల్ ప్రమోషన్స్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక పవర్ ఫుల్ ప్రోమోని రెడీ చేస్తున్నాడట.
ఇక ఈ ప్రోమోని మార్చ్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అసలు ఇప్పట్లో ఈ సినిమా గురించిన వార్త వినము అనుకున్న అభిమానులకు ఈ వార్త పెద్ద సర్ప్రైజ్ ని కలిగిస్తుంది. కాగా ఆల్రెడీ ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ వచ్చి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి ఈ ఊహించని ప్రోమో ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంటే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Next Story