Mon Dec 23 2024 11:07:49 GMT+0000 (Coordinated Universal Time)
OG Movie : పవన్ OG విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ మూవీ 'OG' విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది.
OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ మూవీ 'OG'. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90's బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఇక చాలా కాలం తరువాత పవన్ ఈ సినిమాతో గ్యాంగ్ స్టార్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలిసి అభిమానులు.. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
పవన్ పై మరో పది రోజుల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అది పూర్తి అయ్యితే, సినిమా రిలీజ్ కి సిద్దమవ్వనుంది. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవ్వడంతో.. ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికలు అయ్యేవరకు ఈ మూవీ షూటింగ్ మొదలయ్యేది లేదు. ఆ తరువాతే బ్యాలన్స్ షూట్ ని పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పటినుంచే విడుదల తేదీని లాక్ చేసి పెట్టబోతున్నారు.
ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారట. అదే రోజు పదేళ్ల క్రిందట 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు OG ని కూడా ఆ కలిసొచ్చిన తేదీనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం అయితే నిర్మాతలు ఆ డేట్ ని లాక్ చేసేసారట. త్వరలోనే ఆ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
Next Story