Mon Dec 23 2024 06:25:40 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ 'బ్రో'.. ఎన్ని భాషల్లో అంటే?
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వచ్చిన 'బ్రో' సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వచ్చిన 'బ్రో' సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. యావరేజ్ గా థియేటర్లలో ఆడింది. ఇప్పుడు సినిమా ఓటీటీలో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. జూలై 28, 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను వివాదాలు కూడా వెంటాడాయి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. థియేటర్ లలో ఎంజాయ్ చేయలేకపోయిన వారు.. ఈ చిత్రాన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా విడుదల సమయంలో వివాదాలు కూడా వెంటాడాయి. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ ను పెట్టారని ఏపీ మంత్రి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..! అలాగే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ జరిగింది.
ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటించగా, ప్రియా ప్రకాష్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిషోర్, రాజా చెంబోలు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఫాంటసీ డ్రామాకు తమన్ సంగీతాన్ని అందించాడు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన TG విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా సముద్రఖని తమిళంలో దర్శకత్వం వహించిన 'వినోదాయ సితం' సినిమా రీమేక్. పలు మార్పులు చేసి గ్రాండ్ గా తెలుగులో రూపొందించారు.
Next Story