Mon Dec 23 2024 06:35:17 GMT+0000 (Coordinated Universal Time)
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో కాదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ బ్రో. ఈ సినిమా వచ్చే జులై 28న ప్రేక్షకుల ముందుకు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ బ్రో. ఈ సినిమా వచ్చే జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా మామా అల్లుళ్లు తొలిసారి కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూశామని అభిమానులు చెబుతూ ఉన్నారు. ఇక ఇన్ని రోజులూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో అని ఓ సస్పెన్స్ ఉండగా.. తాజాగా అందుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక, టైమ్ ఖరారైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఏపీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందనే ప్రచారం జరగగా.. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 25న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి పెద్ద సంఖ్యలో పవర్ స్టార్ అభిమానులు శిల్ప కళా వేదికకు రానున్నారు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ బ్రో మూవీ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో కనిపించాడు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫిమేల్ లీడ్స్ గా నటించారు. తమిళంలో హిట్ అయిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. దర్శకుడు సముద్రఖని. తెలుగులో పవన్ క్రేజ్ కి తగినట్టుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను మార్చారు.
Next Story