Mon Dec 23 2024 06:20:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పవన్ కళ్యాణ్ బ్రో టీజర్ రిలీజ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవ్వడంతో వారాహి యాత్రకు బ్రేక్ పడింది. జ్వరంలో కూడా ఆయన తన సినిమా పనుల్ని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవ్వడంతో వారాహి యాత్రకు బ్రేక్ పడింది. జ్వరంలో కూడా ఆయన తన సినిమా పనుల్ని పూర్తి చేస్తున్నారు. తాజా చిత్రం బ్రో సినిమా కోసం డబ్బింగ్ చెప్పారు. పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా టీజర్ రెడీ అయింది. పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా టీజర్ లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో డబ్బింగ్ చెప్పారు. దీని కోసం హైదరాబాద్ నుంచి భీమవరానికి డబ్బింగ్ ఎక్విప్ మెంట్ తీసుకెళ్లారు. జ్వరంతో ఇబ్బంది పడుతూ కూడా.. బ్రో సినిమా టీజర్ కు డబ్బింగ్ పూర్తిచేశారు పవన్. దీంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ విడుదలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. గురువారం సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు బ్రో టీజర్ ను విడుదల చేయబోతున్నారు. జులై 28న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందని చిత్రయూనిట్ తెలిపింది. 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ప్లే బాధ్యతలను తీసుకున్నారు. థమన్ సంగీతం అందించారు.
Next Story