Thu Apr 03 2025 05:34:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రో టీజర్ వచ్చేస్తోంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో (Bro). తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సముద్రఖని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బ్రో టీజర్ త్వరలోనే రిలీజ్ చేస్తామని, టీజర్ అప్డేట్ కూడా ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుంగీ కట్టి స్టైల్ గా నిల్చున్న పోస్టర్ ను వదలారు. పవన్ బ్రో టీజర్ త్వరలో వస్తుందని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Next Story