Mon Dec 23 2024 11:18:33 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : OG మూవీకి వచ్చిన డబ్బులు హెలికాప్టర్ కోసం పెడుతున్నా..
OG మూవీకి వచ్చిన డబ్బులు అన్నిటిని హెలికాప్టర్ కోసం పెడుతున్నా అంటున్న పవన్ కళ్యాణ్.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఖర్చులు కోసం సినిమా చేస్తున్నాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. సినిమాలకు తాను తీసుకునే రెమ్యూనరేషన్ ని రాజకీయంగా ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం తాను నటిస్తున్న OG సినిమా రెమ్యూనరేషన్ ఎందుకోసం ఉపయోగించారు అనేది తెలియజేసారు. నిన్న (ఫిబ్రవరి 28) తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "OG సినిమాకి గాను నాకు వచ్చే రెమ్యూనరేషన్‌ని కేజీ బియ్యం కూడా కొనుకోకుండా, మొత్తం డబ్బుని హెలికాఫ్టర్ ఖర్చుల కోసమే ఉపయోగించుకోవాల్సి వస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఓజి మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం పూర్తి అయ్యిపోయింది. ప్రెజెంట్ పవన్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో.. ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి.
ఎలక్షన్స్ పూర్తీ అవ్వగానే ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ పట్టాలు ఎక్కనుంది. పవన్ ఒక పది రోజులు కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందట. ఇక ఈ పది రోజుల షెడ్యూల్ సింగపూర్ లో ఉంటుందని సమాచారం. సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో రూపొందుతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియారెడ్డి, ఇమ్రాన్ హస్మి, అర్జున్ దాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Next Story