Mon Dec 23 2024 15:19:37 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఎంట్రీ పై చర్చ.. నెటిజెన్ విమర్శ.. రేణూదేశాయ్ సమాధానం..
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినీ రంగప్రవేశం పై నెట్టింట చర్చ. ఒక నెటిజెన్ అకీరా ఎంట్రీ పై చేసిన విమర్శకు రేణూదేశాయ్ బదులిస్తూ.. అసలు అకీరా హీరో ఎంట్రీ ఉంటుందో లేదో తెలియజేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు అకీరా నందన్ (Akira Nandan) సినీ రంగప్రవేశం గురించి రెండు రోజులు నుండి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు.. తన ట్విట్టర్ ఖాతా నుంచి అకీరా ఫోటో షేర్ చేస్తూ అమెరికా ఫిలిం స్కూల్ లో జాయిన్ అవ్వతున్నాడని తెలియజేశాడు. అయితే కొంత సమయం తరువాత రాఘవేంద్రరావు ఆ పోస్ట్ ని డెలీట్ చేశాడు.
ఆ తరువాత రేణు దేశాయ్ (Renu Desai) ఇన్స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చింది.. అకీరాకి ప్రస్తుతం యాక్టింగ్ పై ఇంటరెస్ట్ లేదని, హీరోగా ఎంట్రీ కోసం అకీరా ఏ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం లేదు, ఒకవేళ హీరోగా పరిచయం అయ్యే ఛాన్స్ ఉంటే తానే తెలియజేస్తాను అంటూ రేణూదేశాయ్ పేర్కొంది. ఇక ఈ పోస్టు చూసిన పవన్ అభిమానులు బాధ పడుతున్నారు. అకీరా ఎంట్రీ కోసం చూస్తుంటే.. రేణూదేశాయ్ ఇలా చెబుతుంది ఏంటని అనుకున్నారు.
దీంతో అకీరా హీరో ఎంట్రీ వార్త హాట్ టాపిక్ అవ్వడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఈక్రమంలోనే ఒక నెటిజెన్.. రేణూదేశాయ్ కి ఒక ప్రశ్న వేశాడు. "హీరో అవ్వాలని బ్యాక్గ్రౌండ్ లేని ఎంతోమంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కష్టపడుతుంటారు. కానీ ఇలా ఏ కష్టం లేకుండా ఒక హీరో వారసుడిగా ఎంట్రీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్?" అని ప్రశ్నించాడు. దీనికి రేణూ బదులిస్తూ.. "బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయితే రజినీకాంత్, మాధురీ దీక్షిత్ అవుతారు. ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళని ఎవరు విమర్శించారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చి, వాడి ఫెయిల్యూర్ అయితే.. ఆ తరువాత మీరు ఏమాత్రం జాలి లేకుండా వాళ్ళని విమర్శిస్తుంటారు. ఎంట్రీ ఈజీ అవ్వవచ్చు, కానీ స్టార్ అవ్వడం కాదు" అంటూ పేర్కొంది.
తాజాగా మరో పోస్ట్ వేసి అకీరా యాక్టింగ్ కోర్స్ పై క్లారిటీ ఇచ్చింది. అకీరా అమెరికా ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యింది మ్యూజిక్ అండ్ ఫిలిం మేకింగ్ బిజినెస్ కోర్స్ నేర్చుకోవడానికి అని వెల్లడిస్తూ.. ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Next Story