Mon Dec 23 2024 14:53:46 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ 'ఓజీ' నుండి ఓ సూపర్ అప్డేట్
అనుకున్నట్లుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న
అనుకున్నట్లుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ నుండి ఓ సూపర్ అప్డేట్ రానుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 కి ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ లభించనుంది. ఓజీ మూవీ నుంచి అదిరే అప్డేట్ రానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లు రావని నేరుగా టీజర్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓజీ టీజర్ విజువల్స్, బీజీఎం అందరినీ ఆశ్చర్యపరుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. హంగ్రీ చీతా అంటూ ఆకలితో వేటాడే పులి ఎలా ఉంటుందో చూపించబోతోన్నామని అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్.
సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారని.. 72 సెకన్లతో టీజర్ కట్ చేసినట్టు ఇప్పటికే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ ఉండే అవకాశాలున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. రన్ రజా రన్, సాహో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Next Story