Thu Dec 19 2024 13:08:49 GMT+0000 (Coordinated Universal Time)
Pushpa 2 : 'పుష్ప' మూవీ పై పవన్ కళ్యాణ్ వైరల్ కామెంట్స్..
పుష్ప లాంటి సినిమాలు చూడడానికి బాగుంటాయి. కానీ.. పవన్ కళ్యాణ్ వైరల్ కామెంట్స్.
Pushpa 2 : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని గ్రే షేడ్ పాత్రలో చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపిస్తారు. ఈ పాత్ర పై చాలా విమర్శలు వచ్చాయి. యూత్ ని తప్పుదారి పట్టించేలా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వచ్చారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ గురించి వైరల్ కామెంట్స్ చేసారు.
పవన్ తన పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతూ.. "యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పుష్ప లాంటి సినిమాలు చూడడానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలో అలా చేయడం తప్పు కదా. ఎర్రచందనం కొట్టేవాడిని మనం ఎలా మన బుజాల పైకి ఎక్కించుకోగలం" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా గురించి మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు.
గతంలో కూడా పలు పొలిటికల్ మీటింగ్స్ లో పవన్ ఈ సినిమా గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో.. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి, తనకి వచ్చింది నేషనల్ అవార్డు గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈసారి పుష్ప కథ గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేసారు. ఇప్పటి యువత సినిమాలోని కొన్ని కథలని చూసి ఎంజాయ్ చేయండి, అలా కాకుండా నిజ జీవితంలో అవే కథలని అనుసరించడం అనేది తప్పు అవుతుందని పవన్ చెప్పుకొచ్చారు.
కాగా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్.. ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీలో ఇంపార్టెంట్ సీక్వెన్స్ అయిన జాతర ఫైట్ కోసం కోట్లలో ఖర్చుపెట్టడమే కాదు, నెలలు తరబడి షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మరి మూవీలో ఈ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Next Story