Mon Dec 23 2024 07:51:18 GMT+0000 (Coordinated Universal Time)
ఎఫ్ 3లో పవన్ కల్యాణ్ ? ఏ సన్నివేశంలో కనిపించనున్నారు ?
రేపే ఎఫ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్ : కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఎఫ్ 3. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్లు, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాయి. ఎఫ్ 3 సినిమా.. ఎఫ్ 2 కి ఏ మాత్రం తీసిపోదని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పేశారు.
రేపే ఎఫ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఎఫ్ 3 సినిమాలో పవన్ కల్యాణ్ కూడా కనిపించనున్నారని చెప్పారు. ఇదొక బిగ్ సర్ ప్రైజ్ అని తెలిపారు. ఎఫ్ 3 సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దిల్ రాజు చెప్పిన ఈ విషయంతో పవన్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఎఫ్ 3లో పవన్ కల్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఏ సందర్భంలో పవన్ కనిపిస్తారన్న దానిపైనే ఆసక్తి నెలకొంది.
ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ కూడా నటించారు. ఈ సినిమా అంతా డబ్బు సంపాదన పైనే సాగుతుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ పిర్జాదా నటించారు.
Next Story