మగువా మగువా కన్నా పెద్ద హిట్ అవ్వాలి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ రచ్చ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్ లాంచ్ చేసిన టీం ఇప్పుడు [more]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ రచ్చ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్ లాంచ్ చేసిన టీం ఇప్పుడు [more]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ రచ్చ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్ లాంచ్ చేసిన టీం ఇప్పుడు సాంగ్ ని రిలీజ్ చేయబోతుంది. గత ఏడాది మార్చ్ 8 న మగువా మగువా అంటూ మాయ చేసిన వకీల్ సాబ్.. ఈసారి సత్యమేవ జయతే అంటూ రాబోతున్నాడు. మార్చ్ 3 న సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లుగా టీం ప్రకటించింది. ఆల్రెడీ వకీల్ సాబ్ టీజర్ లోనే సత్యమేవ జయతే ట్యూన్ ఆకట్టుకుంది. అంతకు మించి సత్యమేవ జయతే పాట లిరిక్స్ అందరిని కదలించబోతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భావాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా రామజోగయ్య శాస్త్రి మనసుపెట్టి రాసిన సత్యమేవ జయతే సాంగ్.
గత ఏడాది మగువా మగువా అంటూ సెన్సేషనల్ క్రియేట్ చేసిన వకీల్ సాబ్.. సత్యమేవ జయతే సాంగ్ తో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ క్యూరియాసిటిలో ఉన్నారు. వకీల్ సాబ్ నుండి సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నామంటూ.. ఓ ఆడపిల్ల అర్ధరాత్రి స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగగలిన రోజునే ఈ దేశానికీ నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అన్న బాపూజీ ఫోటోని వెనకాల పెట్టుకుని పవన్ కళ్యాణ్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి ఏప్రిల్ 9 న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ పై మర్కెట్ లో మంచి బజ్ వుంది.. వకీల్ సాబ్ నుండి వస్తున్న అప్ డేట్స్ సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. మరి పవన్ కం బ్యాక్ మూవీ కావడంతో ట్రేడ్ లో అంచనాలున్నాయి. చూద్దాం ఆ అంచనాలను వకీల్ సాబ్ ఏ మేర అందుకుంటాడో అనేది.
- Tags
- pawan kalyan