Mon Nov 25 2024 15:43:55 GMT+0000 (Coordinated Universal Time)
పవన్‌తో విభేదాలపై స్పందించిన త్రివిక్రమ్
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన 'అజ్ఞాతవాసి' సినిమా పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని కూడా నిరాశపరించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పవన్ కు త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మేము ఇదివరకు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అని ఒక్క మాటలో తేల్చిపడేసాడు. ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాలు గురించి చెప్పాడు. తాము తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటామని, ఈ మధ్యే ఆయనకు ఫోన్ చేశానని గుర్తుచేశాడు. అయినా సినిమాలు వల్ల ఫ్రెండ్ ఎలా బ్రేక్ అవుతుందని ? ..'అత్తారింటికి దారేది' సినిమా టైంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అని.. అయినా పవన్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటించుకోరని గెట్టగానే విమర్శలకు జవాబు ఇచ్చాడు త్రివిక్రమ్.
Next Story