Mon Dec 23 2024 11:49:35 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ వాళ్ళు నా బట్టలు విప్పించేవారు.. పాయల్ ఘోష్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సెకండ్ హీరోయిన్ గా కనిపించిన పాయల్ ఘోష్.. బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది.
మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన భామ 'పాయల్ ఘోష్' (Payal Ghosh). ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా ముఖ్య పాత్ర చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే కేవలం ఆరు మాత్రమే. చివరిగా 2017లో ఒక బాలీవుడ్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం మరో హిందీ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ భామ సినిమాలతో తెచ్చుకున్న ఫేమ్ కంటే.. వైరల్ ట్వీట్స్ ద్వారా తెచ్చుకున్న ఫేమ్ ఎక్కువ. ఏదొక విషయం పై సంచలన ట్వీట్స్ చేస్తూ నిత్యం వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ భామ బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. "నేను సౌత్ సినిమాల్లో లాంచ్ అయ్యాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ బాలీవుడ్ లో లాంచ్ అయ్యి ఉంటే నన్ను చూపించడానికి నా బట్టలు విప్పించేవారు. ఎందుకంటే వాళ్ళు క్రియేటివిటీ కంటే అమ్మాయిల శరీరాన్ని చూపి ఆకర్షించడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంటారు" అంటూ ట్వీట్ చేసింది.
గతంలో కూడా బాలీవుడ్ పై పలువురు కామెంట్స్ చేసినప్పటికీ ఈస్థాయిలో ఎవరు చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై ఎవరైనా బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి. కాగా పాయల్ ఘోష్ గతంలో.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ విషయంలో నటి రిచా చద్దా నుంచి కోర్టు నోటీసులు కూడా అందుకుంది.
Next Story