Mon Dec 23 2024 16:15:03 GMT+0000 (Coordinated Universal Time)
ఐటెం మాత్రమే కాదు.. హీరోయిన్ ఛాన్స్ కూడా ఇచ్చాడు!!
RX 100 సెన్సేషన్ పాయల్ రాజపుట్ కి ఇప్పటివరకు ఆమెకి కావాల్సిన ఆఫర్ దొరకలేదు. ఏదో నాగార్జున పక్కన మన్మధుడు 2 లోను, వెంకిమామ లో వెంకటేష్ [more]
RX 100 సెన్సేషన్ పాయల్ రాజపుట్ కి ఇప్పటివరకు ఆమెకి కావాల్సిన ఆఫర్ దొరకలేదు. ఏదో నాగార్జున పక్కన మన్మధుడు 2 లోను, వెంకిమామ లో వెంకటేష్ [more]
RX 100 సెన్సేషన్ పాయల్ రాజపుట్ కి ఇప్పటివరకు ఆమెకి కావాల్సిన ఆఫర్ దొరకలేదు. ఏదో నాగార్జున పక్కన మన్మధుడు 2 లోను, వెంకిమామ లో వెంకటేష్ సరసన పాయల్ రాజపుట్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అందులో నిజం లేదట. కాకపోతే యంగ్ హీరో బెల్లంకొండ సరసన మాత్రం సీత సినిమాలో ఐటెం సాంగ్ కి ఒప్పుకుంది. ఇక డిస్కో రాజా సినిమాలో పాయల్ రాజపుట్ హీరోయిన్ గా ఎంపికైన.. ప్రస్తుతం ఆ సినిమా పై సోషల్ మీడియాలో నెగెటివ్ న్యూస్ లు ప్రచారంలో ఉన్నాయి. RX 110 లో బోల్డ్ కేరెక్టర్, నెగెటివ్ కేరెక్టర్ లో ఇరగదీసిన ఈ భామకు టాప్ రేంజ్ అవకాశాలు లేవు.
అయితే తాజాగా సీత సినిమాలో పాయల్ తో ఆడిపాడబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పాయల్ రాజపుట్ కి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడని… అందుకు పాయల్ కూడా ఒప్పేసుకుందంటున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర్ రావు అనే బయోపిక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు సృష్టించియాన్ భయానక వాతావరణాన్ని వంశీకృష్ణ టైగర్ నాగేశ్వర్ రావు అనే టైటిల్ తో తెరకెక్కించబోతున్నాడు.
ఇక ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ స్పెషల్ గా మేకోవర్ కూడా అవుతాడట. అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన RX పాప పాయల్ రాజపుట్ నటిస్తుందని.. పాయల్ కూడా బెల్లకొండ శ్రీనివాస్ సరసన నటించేందుకు ఒప్పుకుని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేయబోతోందని అంటున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా బెల్లకొండ చెయ్యబోయే రాక్షసన్ రీమేక్ తర్వాత ఉండబోతుంది. మరి సీత సినిమాలో ఐటెం అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ తన తదుపరి చిత్రం ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేసాడు పాయల్ కి.
Next Story