Mon Dec 23 2024 13:04:02 GMT+0000 (Coordinated Universal Time)
Payal Rajput : వాలంటైన్స్ డే పార్టీలో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్..
వాలంటైన్స్ డే పార్టీలో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్. అసలు ఏమైంది..?
Payal Rajput : టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్.. రీసెంట్ గా 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఓ మూడు సినిమాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, పాయల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో పాయల్ తన ప్రియుడు 'సౌరభ్' తలని బాటిల్ తో పగలగొడుతున్నట్లు కనిపించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అసలు ఏమైందని టెన్షన్ పడుతున్నారు.
పంజాబీ ఇండస్ట్రీతో కెరీర్ స్టార్ట్ చేసిన పాయల్.. అక్కడ నటిస్తున్న సమయంలోనే సౌరభ్తో ప్రేమలో పడ్డారు. ఇక ఆ రిలేషన్ ని పాయల్ అహిరంగంగానే మెయిన్టైన్ చేస్తూ వచ్చారు. ఇద్దరు కలిసి పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటిస్తూ వచ్చేవారు. అందుకు సంబంధించిన పోస్టులను కూడా పాయల్ షేర్ చేస్తూ వస్తుంటారు. తాజాగా వాలంటైన్స్ డే నాడు కూడా ఓ ఆల్బమ్ సాంగ్ షూట్ చేసినట్లు సమాచారం.
ఇక ఆ ఆల్బమ్ లోని సీన్కి సంబంధించిన షాట్ కోసమే.. పాయల్ తన ప్రియుడు తలని బాటిల్ తో పగలగొట్టినట్లు తెలుస్తుంది. కాగా ఈ వీడియోని షేర్ చేస్తూ పాయల్ ఇలా రాసుకొచ్చారు.. "వాలంటైన్స్ డేని నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు" అని పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తూ కామెంట్ సెక్షన్ లో సందడి చేస్తున్నారు.
Next Story