అంత వల్గర్ గా… ఇంత ట్రెడిషనల్ గా
RX 100 సినిమాలో కాస్త నెగెటివ్ గా బోల్డ్ గా నటించిన పాయల్ రాజపుట్ RDX లవ్ సినిమాలో పిచ్చ గ్లామర్ గా పిచ్చెక్కించేసింది. నిన్న విడుదలైన [more]
RX 100 సినిమాలో కాస్త నెగెటివ్ గా బోల్డ్ గా నటించిన పాయల్ రాజపుట్ RDX లవ్ సినిమాలో పిచ్చ గ్లామర్ గా పిచ్చెక్కించేసింది. నిన్న విడుదలైన [more]
RX 100 సినిమాలో కాస్త నెగెటివ్ గా బోల్డ్ గా నటించిన పాయల్ రాజపుట్ RDX లవ్ సినిమాలో పిచ్చ గ్లామర్ గా పిచ్చెక్కించేసింది. నిన్న విడుదలైన RDX లవ్ సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు అంటే ఆ సినిమా ఎలావుందో అర్ధమవుతుంది. బూతు పురాణానికి వెనకో నీతి సందేశం అంటేనే RDX లవ్ అనేలా ఉంది. పరమ బూతు డైలాగ్స్, చెత్త శృంగార నీతులు, చెత్త కథ, కథనం, పొంతన లేని డైరెక్షన్, పాయల్ రాజ్పుట్ తన ప్రధాన కర్తవ్యం అందాల ప్రదర్శనే అన్నట్టుగా బూతు డైలాగ్స్ తో గ్లామర్ గా రెచ్చిపోయింది తప్పితే సినిమాలో మరొక విషయమే కనబడదు. ఈ సినిమా చూశాక పాయల్ ని మళ్లీ సినిమాల్లోకి తీసుకోవాలంటే అలాంటి కథలే అంటే బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీసే వారే తీసుకుంటారు అది ఫిక్స్.
వెంకీమామ పక్కన….
మరి ఈ సినిమా వల్ల వెంకటేష్ వెంకిమామ, రవితేజ డిస్కో రాజాకి పాయల్ గ్లామర్ తో డ్యామేజ్ అంటూ ఆ మధ్యన తెగ ప్రచారం జరిగింది. ఇది నిజంగా నిజమే. మరి వెంకిమామ దసరా పోస్టర్ లో వెంకటేష్ పక్కన చీరలో ట్రెడిషనల్ గా ఉన్న పాయల్ చూస్తే ముద్దొచ్చింది. కానీ RDX సినిమా చూశాక పాయల్ మీదున్న అంచనాలు పోవడం పక్కా. వెంకటేష్ పక్కన ఇలాంటి బోల్డ్ భామ నటించింది అని అనక మానరు.