Sun Dec 22 2024 14:59:35 GMT+0000 (Coordinated Universal Time)
Nagarjuna : నాగార్జునని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్..
తెలుగు బిగ్బాస్ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జునని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.
Nagarjuna : తెలుగు బిగ్బాస్ షోకి నాగార్జున హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఏడు సీజన్లు పూర్తి కాగా.. ఐదు సీజన్స్ కి నాగార్జునే హోస్టుగా వ్యవహరించారు. ఇక ఈ షో పై ఎన్ని విమర్శలు వస్తున్నా, అభ్యంతరాలు వినిపిస్తున్నా.. బిగ్బాస్ నిర్వాహుకులు నడిపిస్తూనే వస్తున్నారు. టీవీలో షోని ప్రేక్షకులు ఆదరిస్తూనే వస్తున్నారు. ఇక ఈ 7వ సీజన్ ఎండింగ్.. దాడులతో, గొడవలతో రచ్చరచ్చగా సాగింది. దీంతో ఆ దాడికి కారణమైన బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి ఫ్యాన్స్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజాగా బిగ్బాస్ హోస్ట్ నాగార్జున పై కూడా పిటిషన్ దాఖలు అయ్యింది. అడ్వాకెట్ అరుణ్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. 100 రోజులు పాటు కొందరు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ ని అందజేశారట. ఈ విషయం పట్ల బిగ్బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని కూడా విచారించాలంటూ పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ మరియు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం పై విచారణ జరపాలంటూ కోరారు.
ఇక ఆ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జునని తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై తీవ్ర అగ్రం వ్యక్తం చేశారు. మరి ఈ పిటిషన్ పై నాగార్జున, బిగ్బాస్ నిర్వాహుకులు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఇలాంటి పిటిషన్ లో హైకోర్టులో నమోదు అయ్యినప్పటికీ.. వాటిని న్యాయస్థానం కొట్టిపారేసింది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
Next Story