Mon Dec 23 2024 10:23:40 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD : ప్రభాస్ 'కల్కి' సెట్స్ నుంచి ఫోటోలు లీక్..
ప్రభాస్ 'కల్కి' మూవీ సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ కొత్త పిక్స్ ని మీరు చూశారా..?
Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కల్కి'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లో విడుదల కాబోతుంది. దీంతో షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఒక పక్క షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ ని కూడా చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే పలు ఈవెంట్స్ లో సందడి చేయడంతో పాటు షూటింగ్ BTS అండ్ మేకింగ్ వీడియోలను షేర్ చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక కొత్త BTS వీడియోని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ వీడియో రిలీజ్ కి ముందే.. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అయ్యిపోయాయి. వీడియో ఫైనల్ కట్ ని స్టూడియోలో స్క్రీన్ పై చూస్తుండగా.. దానిని ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో కూడా ఇదే తరహాలో లీక్ అయ్యింది.
వైజయంతి మూవీస్ పతాకంలో సి అశ్వనీదత్ హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోనె, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, అమితాబ్ బచ్చన్, నాని, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కూడా కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు. మే 9న ఇండియన్ లాంగ్వేజ్స్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారట.
Next Story