చైతు తో గీత నా?
అస్సలు ఇంతవరకు వినబడని కాంబినేషన్ అది. నాగ చైతన్య తో రష్మిక జంటగా నటిస్తుందని. చైతు తో గీత(రష్మిక) నటించడం అనేది పెద్ద షాకింగ్ కాదు కానీ… [more]
అస్సలు ఇంతవరకు వినబడని కాంబినేషన్ అది. నాగ చైతన్య తో రష్మిక జంటగా నటిస్తుందని. చైతు తో గీత(రష్మిక) నటించడం అనేది పెద్ద షాకింగ్ కాదు కానీ… [more]
అస్సలు ఇంతవరకు వినబడని కాంబినేషన్ అది. నాగ చైతన్య తో రష్మిక జంటగా నటిస్తుందని. చైతు తో గీత(రష్మిక) నటించడం అనేది పెద్ద షాకింగ్ కాదు కానీ… అసలెక్కడా ఇంతవరకు బయటికి వినిపించని కాంబో ఇది. ‘వెంకిమామ’తో బిజీగా ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవితో ఒక సినిమా కమిట్ అవడం, సెట్స్ మీదకెళ్ళడం జరిగింది. అలాగే స్టార్ హీరో మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా నితిన్ తో భీష్మ’ లోనూ రశ్మికనే హీరోయిన్.
అదే నువ్వు….అదే నేను
ఇక చైతు – రష్మిక జంటగా ఓ సినిమా అనగానే అభిమానులకు పండగలా ఉన్నప్పటికీ.. ఒక్కసారిగా విన్నవారికి షాకింగ్ విషయమే. మరి ఈ కాంబోలో మూవీ రాబోతుంది అని ఏ దర్శకుడో, ఏ నిర్మాతో, ఏ హీరోనో, లేదంటే రశ్మికనో కన్ఫర్మ్ చెయ్యలేదు. చైతు – రశ్మికల సినిమా శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ఓ ప్రముఖ ఛానల్ బయటపెట్టింది. అంతేకాకుండా చైతు – రశ్మికల కాంబో డైరెక్టర్, నిర్మాత పేర్లు చెప్పలేదు కానీ… ఏకంగా ఆ సినిమా టైటిల్ కూడా ఆ ప్రముఖ జెమిని ఛానల్ రివీల్ చెయ్యడం షాకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. చైతు – రష్మిలా సినిమా టైటిల్ ‘అదే నువ్వు అదే నేను’ అంట. మరి సినిమా మొదలవ్వకుండానే శాటిలైట్ హక్కులు అమ్ముడు పోవడం అనేది కూడా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.