Mon Dec 23 2024 08:39:30 GMT+0000 (Coordinated Universal Time)
సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు : తెలుగు సినిమాపై మోదీ ప్రశంసలు
రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా
తెలంగాణలోని ముచ్చింతల్ లో అతిపెద్ద రామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తెలుగు సినిమా పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా కీర్తి దేశమంతా వ్యాపిస్తోంది. ప్యాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ లోనూ సత్తా చాటడం ఒక ఎత్తైతే.. తెలుగు సినిమాపై మోదీ ప్రశంసలు కురిపించడం నెక్ట్స్ లెవల్.
"తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమగా రూపొందింది. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోంది. సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది." అంటూ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించారు.
Next Story