Sun Dec 22 2024 18:33:00 GMT+0000 (Coordinated Universal Time)
'జవాన్'లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను గురించి ఎందుకింత చర్చ..
జవాన్ మూవీలోని ఒక సీన్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ఆ సీన్ పై మీమ్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇంతకీ అసలు ఆ సీన్ ఏంటి..?
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన 'జవాన్' (Jawan) సినిమా ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉంటే, నెట్టింట ఈ మూవీలోని ఒక సీన్ గురించి చర్చ జరుగుతుంది. ఆ సీన్ పై మీమ్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇంతకీ అసలు ఆ సీన్ ఏంటి..?
ఈ మూవీలోని ఒక సీన్ లో షారుఖ్ ఖాన్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. ఆ సమయంలో షారుఖ్ ఉపయోగించిన ఫోన్.. పోకో మోడల్ (Poco phone) ఫోన్. అయితే ఇందులో పెద్ద చర్చించాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా..? ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. షారుఖ్ 'రియల్ మీ' (Realme) బ్రాండ్ ఫోన్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. అందువలనే ఈ విషయం నెట్టింట చర్చకి దారితీసింది.
స్మార్ట్ఫోన్ మార్కెట్ లో రియల్ మీ, పోకో మధ్య మంచి పోటీ ఉంది. అలాంటిది 'రియల్ మీ'కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తూ.. సినిమాలో షారుఖ్ పోకో ఫోన్ వాడడం పై నెటిజెన్స్ హాస్యం వ్యక్తం చేస్తున్నారు. పాపం రియల్ మీ అంటూ మీమ్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా షారుక్ వాడిన మోడల్.. 'పోకో ఎక్స్4 ప్రో' అని గుర్తించి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిరోజే ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. రెండో రోజుల్లో మొత్తం మీద రూ.129 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. కాగా పఠాన్ మూవీ లాగానే ఈ చిత్రం కూడా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే గనుక సాధిస్తే.. 1000 కోట్ల క్లబ్ లో రెండు చిత్రాలు ఉన్న మొదటి ఇండియన్ హీరోగా షారుఖ్ రికార్డు సృష్టిస్తాడు.
Next Story