Mon Dec 23 2024 09:05:19 GMT+0000 (Coordinated Universal Time)
Jony Master : జానీ మాస్టర్ కోసం నాలుగు పోలీసు బృందాలు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదయింది. ఆయన కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదయింది. మైనర్ గా ఉన్న సమయంలోనే తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ మహిళ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై పోక్సో కేసును నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
నార్త్ ఇండియాలో...
జానీ మాస్టర్ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నార్త్ ఇండియాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులకు టోకరా ఇచ్చి పారిపోయినట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్ లో పోక్సో యాక్ట్ ను పోలీసులు చేర్చడంతో జానీ మాస్టర్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుందని అనుకోవచ్చు.
Next Story