Fri Dec 20 2024 03:51:53 GMT+0000 (Coordinated Universal Time)
సింగర్ శ్రావణ భార్గవి పై తిరుపతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
సింగర్ శ్రావణ భార్గవి పై కేసు పెట్టారుగా
టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన 'ఒకపరి కొకపరి వయ్యారమై..' అనే కీర్తనకి వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. ఈ వీడియోలో తన అందాన్ని అభివర్ణిస్తున్నట్టుగా ఆ సంకీర్తనని పాడింది. అయితే ఈ వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి తన అందాన్ని చూపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి వీడియో చేయడం చాలా తప్పని అన్నమయ్య వంశస్థులు ఆగ్రహించారు.
శ్రావణ భార్గవి చాలా బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తుందని హరినారాయణ చార్యులు తెలిపారు. గాయని శ్రావణి భార్గవి పై అన్నమయ్య అభిమానులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్నమయ్య కీర్తనలతో చేసిన వీడియో తొలగించాలని, పాట తొలగించాలని విజ్ఞప్తి చేసిన తాళ్లపాక వంశీయులతో శ్రావణి భార్గవి దురుసుగా మాట్లాడారని శ్రావణి భార్గవి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చర్యతో శ్రావణభార్గవి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు.
Next Story