Mon Dec 23 2024 11:25:02 GMT+0000 (Coordinated Universal Time)
రణ్‌వీర్‌సింగ్ పై కేసు నమోదు.. కారణం అదే
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఆయన ఈ నెల 22వ తేదీన హాజరు ముంబయి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. రణవీర్‌సింగ్ ప్రస్తుతం ముంబయిలో లేకపోవడంతో ఆయనకు ఇంకా నోటీసులు అందలేదు. ఈనెల 16న ఆయన తిరిగి వస్తుండటంతో ఆరోజున పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. మహిళా న్యాయవాది ఒకరు రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలపై చెంబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళలను అవమానించడమే.....
ఇటీవల బాలీవుడ్ నటుడు తన న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు రణవీర్‌సింగ్ పై ఐపీసీ సెక్షన్ 509, 292, 294 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 ఎ కింద కేసు నమోదు చేశారు. తన నగ్న ఫొటోలను షేర్ చేసి మహిళల మనోభావాలను దెబ్బతీశాడని ఆయన పై ఫిర్యాదు అందిందని పోలీసులు చెబుతున్నారు. ఇది ఒక రకంగా మహిళలను అవమానించడమేనని, ఆయన పై కేసు నమోదు చేయాలని రణవీర్ సింగ్ పై మహిళ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story