Mon Dec 23 2024 15:03:13 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేస్తున్న పొన్నియన్ సెల్వన్
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పొన్నియన్ సెల్వన్ రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. PS-1, నవంబర్ 18, 2022న Amazon Prime వీడియోలో ప్రీమియర్ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. OTT ప్లాట్ఫారమ్ ద్వారా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, కార్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లతో పాటు మణిరత్నం కూడా నిర్మించారు. కల్కి కృష్ణ మూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా రూపొందించి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. 947-1014లో ప్రఖ్యాత చోళ పాలకుడైన రాజరాజ I జీవితం ఆధారంగా రూపొందించబడింది. దక్షిణ భారతదేశంలో చోళుల పాలనను తిరిగి స్థాపించాడు. మొదటి భాగం సెప్టెంబర్ 30న తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
Next Story