Sun Dec 22 2024 21:29:22 GMT+0000 (Coordinated Universal Time)
పూజా హెగ్డేకు బెదిరింపులు.. క్లారిటీ ఇదే!!
ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల దుబాయ్ వెళితే, అక్కడ వివాదం
ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల దుబాయ్ వెళితే, అక్కడ వివాదం చోటుచేసుకుందని, కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వచ్చింది. పూజా హెగ్డేకి చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు వార్తలు రావడంతో ఏమి జరిగిందో అని తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపించారు. దుబాయ్‌లో గొడవ తర్వాత నటికి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు షికార్లు చేశాయి. పూజా ఓ క్లబ్ ఓపెనింగ్ కోసం అక్కడకు వచ్చిందని, ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చిందని ప్రచారం చేశారు.
అయితే, అలాంటి సంఘటనేమీ జరగలేదని పూజా టీమ్ ఇప్పుడు స్పష్టం చేసింది. నటి ప్రతినిధి ఫ్రీ ప్రెస్ జర్నల్‌తో మాట్లాడుతూ, “ఈ నకిలీ వార్తలను ఎవరు ప్రారంభించారో మాకు తెలియదు. ఇది పూర్తిగా అవాస్తవం." అని అన్నారు. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని పూజా హెగ్డే ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఆధారాలు లేకుండా ఎలా రాస్తారని పూజా హెగ్డే టీమ్ ప్రశ్నించింది. ప్రజలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
Next Story