Mon Dec 23 2024 16:58:14 GMT+0000 (Coordinated Universal Time)
పోసాని తన భార్య పేరు మీద ఎన్ని కోట్ల ఆస్తి రాసి పెట్టారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న పోసాని
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను చనిపోతే నా శవాన్ని చూడటానికి ఇండస్ట్రీ జనాలు ఎవరు రాకూడదు. ఈ విషయం గురించి ఇప్పటికే నా భార్య ను, నా కుటుంబాన్ని సిద్ధం చేశానని అన్నారు. పోసాని కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఎన్నో విభాగాల్లో ఆయన పని చేశారు. ఆయనకు కొందరితో రాజకీయ పరంగా విబేధాలు ఉన్నా.. ఆయన అంటే అభిమానించే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటిది సినిమా వాళ్లు చూడకూడదని ఎందుకు అన్నారో అర్థం అవ్వడం లేదు.
తన చావు గురించి కూడా పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఇప్పటికిప్పుడు ఎవరైనా హత్య చేసిన కానీ, నేను చనిపోయిన కానీ చిన్న కన్నీటి బొట్టు కూడా కార్చవద్దని నా భార్యకు చెప్పానన్నారు. ఆమెకు నాతో గడిపిన సంతోషకరమైన క్షణాలు గుర్తు ఉండాలి కానీ, నా చావు కాదన్నారు. ఒకవేళ నేను చనిపోతే ఏమి చేసి బతకాలి అనే ఆలోచన ఆమెకు ఉండకుండా... 50 కోట్ల విలువైన ఆస్తులు ఆమె పేరు మీద రాశానన్నారు. నెలకు దాదాపు 9 లక్షలు వాటి మీద వస్తుంటాయని తెలిపారు. ఇక నా పిల్లలు మున్ముందు ఎలా ఉంటారో తనకే తెలియదని.. ఇక్కడ ఉండవచ్చు లేదా విదేశాల్లో ఉండవచ్చన్నారు. ఏమి జరిగిన కానీ నా భార్య ఇబ్బంది పడకూడదని ఆస్తి ఆమె పేరు మీద రాశానని చెప్పారు. నేను చాలా నిజాయితీగా, చాలా గొప్ప బతుకు బతికాను. కాబట్టి నా శవాన్ని నా కుటుంబం, నా రక్త సంబంధం వాళ్ళు మాత్రమే చూడాలి, బయట వాళ్ళ సానుభూతి నాకు అవసరం లేదని అన్నారు.
Next Story