Mon Dec 23 2024 14:11:51 GMT+0000 (Coordinated Universal Time)
డిజిటల్ ప్రేక్షకులకు "భీమ్లా" డబుల్ బొనాంజా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లో భీమ్లానాయక్ స్ట్రీమింగ్ కానుంది. ఆహాలోనూ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 25 నుంచి భీమ్లానాయక్ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ తెలిపారు.
మార్చి 25 నుంచి....
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటించిన భీమ్లా నాయక్ గత నెల 25 వతేదన విడుదలయింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు కూడా సాధించింది. మూడు రోజల్లోనే వందకోట్లు సాధించిన భీమ్లానాయక్ ను కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి నిర్మాతలు విడుదల చేయనున్నారు. కొత్త సినిమాలు రాథేశ్యామ్ విడుదల కావడం, RRR మూవీ కూడా మార్చి 25వ తేదీన విడుదలవుతుండటంతో థియేటర్లలో భీమ్లానాయక్ ప్రదర్శించడం కష్టమే. అందుకే మేకర్స్ ఓటీటీలోకి త్వరగా ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు.
- Tags
- bhimla nayak
- ott
Next Story