Mon Dec 23 2024 00:05:14 GMT+0000 (Coordinated Universal Time)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి.. ఆయన స్థాయిని సినిమాల కలెక్షన్స్, రిజల్ట్స్ డిసైడ్ చేయవు
మెగాస్టార్ చిరంజీవి.. ఆయన స్థాయిని సినిమాల కలెక్షన్స్, రిజల్ట్స్ డిసైడ్ చేయవు..! తెలుగు వాళ్లలో ఆయన మీద ఉన్న అభిమానం డిసైడ్ చేస్తుంది. ఎక్కడకు వెళ్లినా.. ఎవరిని పలుకరించినా ఆయన గొప్పతనం గురించి చెబుతారు. మెగా ఫ్యామిలీలో మాత్రమే కాదు.. ఎంతో మందికి ఆయనొక ఇన్స్పిరేషన్..! ఆయన్ను చూస్తూ నేర్చుకున్న వాళ్లు కొందరైతే.. ఆయనతో పాటూ ఉంటూ ఎదిగిన వాళ్లు ఇంకొందరు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత గొప్ప స్టార్ అయినా.. చిరంజీవి కారణంగానే ఆయన ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటారు. తాజాగా తన అన్నయ్య గురించి ఎమోషనల్ అయ్యి.. ఒక పోస్టు పెట్టారు పవన్ కళ్యాణ్. తన అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. పవన్ కళ్యాణ్ ఒక నోట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
“అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..!” అంటూ రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
Next Story