Mon Dec 23 2024 13:43:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ రిలీజ్ అప్ డేట్
బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతిసనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్..
ముంబై : పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యామ్, స్పిరిట్, సలార్, ఆదిపురుష్ ఇలా వరుసపెట్టి అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుదల కానుంది. స్పిరిట్, సలార్ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : సెటిల్మెంట్ కు పిలిచి కాల్చి చంపారు
వీటితోపాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతిసనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి అప్డేట్స్ చాలా తక్కువ. శివరాత్రి సందర్భంగా ఆదిపురుష్ నుంచి మేకర్స్ బిగ్ అప్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ సినిమా 3D వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
Next Story