Mon Dec 23 2024 10:01:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
చిత్రబృందం టీజర్ ను కట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ తర్వాత సినిమా ప్రమోషన్ పనులు..
బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో వరుస హిట్లు అందుకున్న ప్రభాస్.. సాహో తో హ్యాట్రిక్ కొడతాడని అనుకున్నారంతా. కానీ బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన.. సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. రెండు ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. సినిమా అనౌన్స్ చేశాక ప్రభాస్ పోస్టర్ ఒక్కటి తప్ప.. మరే అప్డేట్ ఇవ్వకపోవడంతో.. అభిమానులు మేకర్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 3న ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టీజర్ రిలీజ్ ఈవెంట్ ను అయోధ్యలో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. చిత్రబృందం టీజర్ ను కట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ తర్వాత సినిమా ప్రమోషన్ పనులు మొదలు పెడతారని టాక్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
Next Story