Fri Dec 20 2024 05:59:52 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : హిట్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నాడా.. ఈ కొత్త మార్పు ఏంటి
హిట్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నాడా..? 'రాజా సాబ్' మూవీ ఫస్ట్ లుక్ ఈ మార్పుని మీరు గమనించారా..?
Prabhas : సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది సక్సెస్ కోసం జ్యోతిష్యం, న్యూమరాలజీ నమ్మి తమ ఒరిజినల్ పేరుని మార్చుకొని స్క్రీన్ పై మరో పేరుతో పరిచయం అవుతుంటారు. కొంతమంది కెరీర్ మధ్యలో కూడా పేరుని మార్చుకుంటుంటారు. ఇప్పుడే ఇదే తరహాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పేరు మార్చుకున్నారా అనే సందేహం కలుగుతుంది. ఇన్నాళ్లు స్క్రీన్ పై ప్రభాస్ పేరుని ఇంగ్లీష్లో 'Prabhas' అని రాసేవారు.
కానీ ఇప్పుడు కొత్తగా ఆ స్పెల్లింగ్ లో మరో అక్షరం వచ్చి చేరింది. ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా 'రాజా సాబ్'. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ పేరుని ఇంగ్లీష్లో 'Prabhass' అంటూ ఒక 'S' అక్షరాన్ని అదనంగా జత చేశారు. ఇక ఇది గమనించిన అభిమానులు ఇలా మరో అక్షరాన్ని ఎందుకు యాడ్ చేసారని చర్చించుకుంటున్నారు.
మరి ఇలా చేయడం వెనుక జ్యోతిష్యం, న్యూమరాలజీ కారణం ఏమైనా ఉందా అనేది తెలియాలి. బాహుబలి తరువాత నుంచి ప్రభాస్ వరుస ప్లాప్ లు ఎదురయ్యాయి. ఇటీవల వచ్చిన 'సలార్' హిట్ అనిపించుకున్నప్పటికీ.. దానికి చాలా సమస్యలే ఎదురయ్యాయి. ఈక్రమంలోనే ఒక సరైన హిట్టు కోసం ప్రభాస్ తన పేరుని మార్చుకున్నారా..? అనే డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ ఎక్స్ట్రా లెటర్ యాడ్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటో ప్రభాస్ టీమే చెప్పాలి.
ఇక రాజా సాబ్ విషయానికి వస్తే.. హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. వింటేజ్ ప్రభాస్ ని ఈ సినిమాతో మళ్ళీ పరిచయం చేయబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందట. ప్రస్తుతం ప్రభాస్ కల్కి షూటింగ్ లో ఉండడంతో ఈ మూవీకి బ్రేక్ పడింది.
Next Story