తనేమన్నా చిన్న పిల్లోడా?
ప్రస్తుతం మీడియా వారికీ ప్రభాస్ పెళ్లి అనేది పెద్ద హాట్ న్యూస్ అయింది. కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం కృష్ణంరాజు ఫ్యామిలీకి పెద్ద తలనొప్పిలా మారిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటే.. ఒకసారి బాహుబలి తర్వాత అంటూ ఐదేళ్లు కాలం గడిపేశాడు. ఇప్పుడు సాహో అంటూ ఇప్పటికే రెండేళ్లు కాలం గడిచిపోయేలా చేస్తున్నాడు. మరి 35 ఏళ్ళు పైబడిన ప్రభాస్ కి పిల్ల దొరక్కా? లేదంటే సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండా? లేదంటే అనుష్క ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అనేది ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనబడడం లేదు.
మరి ప్రభాస్ పెదనాన్న కృష్ణ రాజు ఎక్కడ కనబడినా మీడియా ముందుగా ప్రభాస్ పెళ్లి గురించిన ప్రశ్నే ఎదురవుతుంది. దానికి ఇప్పటివరకు కృష్ణ రాజు కూడా కూల్ గా సావధానంగానే సమాధానం చెబుతూ వచ్చాడు. కానీ ప్రస్తుతం కృష్ణ రాజు ప్రభాస్ పెళ్లి విషయం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ప్రభాస్ ఏం చిన్న పిల్లోడు కాదు. ప్రభాస్ కు 30 ఏళ్ళు దాటిపోయాయి. అతనేం చిన్న పిల్లోడు కాదు... పెళ్లి విషయం అతనే ఆలోచించుకోవాలి. ఇక మేము కూడా పెళ్ళెప్పుడు చేసుకుంటావ్, పెళ్లి చేసుకో అని అడుగుతూనే ఉంటాం... ఇక ప్రభాస్ కూడా పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు.
ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ ఉన్నత శిఖరాలను ఎక్కాడు అని చెప్పిన కృష్ణ రాజు.... తమ కుటుంబం గురించిన మరికొన్ని ఆసక్తికర విషయాలను కూడా ముచ్చటించాడు. అవేమిటంటే... కృష్ణరాజు గారి మాటల్లో... మా కుటుంబాల్లో ఎలా ఉంటుంది అంటే... కొడుకు పుట్టిన తర్వాత అతడిని ఐదు సంవత్సరాల వయసు వరకు దేవుడిలా చూడాలట. ఇక ఆ తర్వాత అపిల్లాడికి పద్దెనిమిది సంవత్సరాల నిండేవరకు బానిసలా చూడాలట. అంటే ఆ బానిసగా చూసే పద్దెనిమిదేళ్ల లోపు సమయంలోనే... దారిలో పెట్టాలి. ఇక అతనికి పద్దెనిమిదేళ్ల తర్వాత స్నేహితుడిలా చూడాలట అంటూ ఆసక్తికర విషయాలను ముచ్చటించాడు.