Sat Dec 21 2024 02:18:52 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు ప్రభాస్.. మరే హీరో..
ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరూ చేయని ప్రయోగాలను, సినిమాలను, పాత్రలను ప్రభాస్ చేసుకుంటూ తానే నెంబర్ వన్ అని నిరూపించుకుంటున్నాడు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది..
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరూ చేయని ప్రయోగాలను, సినిమాలను, పాత్రలను చేసుకుంటూ తానే నెంబర్ వన్ అని నిరూపించుకుంటున్నాడు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పౌరాణిక పాత్రలు గురించి. సీనియర్ ఎన్టీఆర్ ఉన్న కాలంలో తెలుగు ఇండస్ట్రీ పౌరాణిక, జానపద సినిమాలతో ఒక వెలుగు వెలిగింది. ఆయన తరువాత అటువంటి సబ్జెక్టుల వైపు మరో హీరో మక్కువ చూపకపోవడంతో ఆ జోనర్ చిత్రాలు పెద్దగా కనిపించకుండా పోయాయి.
ఇక ఈమధ్య కాలంలో మళ్ళీ ఆ జోనర్స్ కి ఆడియన్స్ లో ఆదరణ పెరుగుతూ వస్తుంది. అందుకు కారణం ప్రభాస్ చేసిన ప్రయోగమే. బాహుబలితో జానపద కథ అనుభూతుని ప్రపంచం మొత్తానికీ తెలియజేసిన ప్రభాస్.. ఆ తరువాత పౌరాణిక కథలతో కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించిన ప్రభాస్.. త్వరలో రాబోయే కల్కి (Kalki 2898 AD) సినిమాలో విష్ణుమూర్తి అవతారంలో కనిపించబోతున్నాడు.
తాజాగా మహాశివుడి పాత్రలో కూడా ప్రభాస్ దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మంచు విష్ణు 'భక్త కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ ఒక ముఖ్య చేయబోతున్నాడట. ఆ పాత్ర లార్డ్ శివ అని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాలు మాత్రమే కాదు, గతంలో కూడా ప్రభాస్ కొన్ని పౌరాణిక పాత్రల్లో కనిపించాడు. రాజమౌళి ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ బ్యానర్ టైటిల్ కోసం విశ్వామిత్ర గెటప్ లో కనబడి ఆకట్టుకున్నాడు.
ఒకప్పుడు ఏ దేవుడి పాత్ర గురించి మాట్లాడినా సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేవారు. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్లలో ప్రభాస్.. రాముడిగా, విష్ణువుగా, శివుడిగా ముద్ర వేసుకుంటూ వెళ్తున్నాడు. కేవలం తెలుగు వారికీ మాత్రమే కాదు, ఇండియా వైడ్ ప్రభాస్ దేవుడిగా వెండితెర పై దర్శనమిస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ప్రభాస్ ఇంకెన్ని పౌరాణిక పాత్రల్లో ఆడియన్స్ ముందుకు వస్తాడో చూడాలి.
Next Story