Sun Dec 22 2024 23:42:57 GMT+0000 (Coordinated Universal Time)
అభిమాని మృతి.. కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ప్రభాస్
సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలో ఓ అభిమాని ప్రమాద వశాత్తు చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలోని కారంపూడి పల్నాడు
గుంటూరు : ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. తొలి మూడ్రోజుల్లో రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదలైన రాధేశ్యామ్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కాగా.. సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలో ఓ అభిమాని ప్రమాద వశాత్తు చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక బ్యానర్ కడుతూ చల్లా కోటేశ్వరరావు అనే అభిమాని మృతి చెందాడు.
అభిమాని మరణం గురించి తెలుసుకున్న ప్రభాస్.. వెంటనే ఆయన భార్య అకౌంట్ లో రూ.2 లక్షలు జమ అయ్యేలా చేశారు. చల్లా కోటేశ్వరరావు అనే అభిమాని నిరుపేద వ్యక్తి అని ప్రభాస్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో.. వెంటనే స్పందించిన ప్రభాస్ ఆ కుటుంబానికి తనవంతు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రభాస్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు సమాచారం.
Next Story