Sun Dec 22 2024 22:52:29 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : అయోధ్య రామ భక్తుల కోసం ప్రభాస్ 50 కోట్ల విరాళం..
అయోధ్య రామ భక్తుల కోసం ప్రభాస్ 50 కోట్ల విరాళం అందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు.
Prabhas : మన డార్లింగ్ ప్రభాస్ మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మంచితనంతో అందరి మనసుని గెలుచుకొని డార్లింగ్ అనే ట్యాగ్ ని తన ఇంటి పేరుని చేసుకున్నారు. ఇక తాజాగా అయోధ్య రామ మందిరం విషయంలో ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సంగతి తెలిసిందే.
ఇక మహత్కార్యాన్ని చూసేందుకు దేశంలోని భక్తులతో పాటు ప్రపంచం నలుమూలలు నుంచి తరలి వస్తున్నారు. అలా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు రామ మందిరం ట్రస్ట్ తో పాటు అయోధ్య ప్రజలు కూడా సన్నధం అవుతున్నారు. ఇక వారికీ చేయూతని అందిస్తూ దేశంలోని పలువురు భక్తులు.. విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే మన ప్రభాస్ కూడా భారీ విరాళం అందించారు.
రామ విగ్రహ ప్రతిష్ట రోజు భక్తులకు అయ్యే భోజన ఖర్చులు అన్ని ప్రభాస్ భరించనున్నారట. ఈక్రమంలోనే ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం.. రామ మందిరం ట్రస్ట్ కి దాదాపు 50 కోట్ల విరాళాన్ని ప్రభాస్ అందించారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త చూసిన తెలుగు ఆడియన్స్.. బహుబలిలోని డైలాగ్ ని కామెంట్స్ చేస్తున్నారు. రాజు ఎక్కడ ఉన్నా రాజేరా అంటూ ప్రభాస్ ని అభినందిస్తున్నారు.
Next Story