Fri Dec 20 2024 14:22:29 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్లో ఇది గమనించారా.. సలార్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రభాస్ ఎమోజీ..
రెబల్ ఫ్యాన్స్ ట్విట్టర్లో ఇది గమనించారా..? సలార్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రభాస్ ఎమోజీలు వస్తున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ 'సలార్'. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ 'సీజ్ ఫైర్' ఈ క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఇక ఈ రిలీజ్ కి ఇంకో రెండు నెలలు ఉన్నపటికీ సోషల్ మీడియాలో ఇప్పటినుంచే సలార్ హడావుడి కనిపిస్తుంది. సలార్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ రోజు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూనే వస్తున్నారు.
అయితే తాజాగా చిత్ర యూనిట్.. ఈ హ్యాష్ట్యాగ్స్లో ఒక అప్డేట్ ని తీసుకు వచ్చింది. ట్విట్టర్ లో కొన్ని హ్యాష్‌ట్యాగ్స్ టైప్ చేస్తే వాటితో పాటు ప్రభాస్ సలార్ లుక్ ఎమోజీ కూడా వస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీం.. ఆ హ్యాష్‌ట్యాగ్స్ ఏంటి అనేవి అభిమానులకు తెలియజేసింది. ఇక ఇది తెలుసుకున్న రెబల్ ఫ్యాన్స్.. ఆ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్విట్టర్ మొత్తాన్ని ప్రభాస్ ఎమోజీలతో నింపిస్తున్నారు. ఒకసారి ఆ హ్యాష్‌ట్యాగ్స్ ఏంటో మీరుకూడా చూసేయండి.
ఇది ఇలా ఉంటే, రేపు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సలార్ నుంచి ఏమన్నా అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక చిన్న టీజర్ మాత్రం రిలీజ్ అయ్యింది. దానిలో కూడా ప్రభాస్ పేస్ సరిగ్గా చూపించకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. దీంతో ఈ బర్త్ డేకి ప్రభాస్ సంబంధించిన ఒక టీజర్ లేదా ట్రైలర్ అయినా రిలీజ్ చేయాలంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.
కానీ మూవీ టీం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. మరి రేపు ఏదైనా సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా..? అనేది వేచి చూడాలి. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, టాలీవుడ్ జగ్గూభాయ్ విలన్స్ ఆ నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
Next Story