ప్రభాస్ నెక్స్ట్ మూవీలో ఫైట్స్ లేవట
ప్రభాస్ బాడీ అండ్ ఆ కటౌట్ చూసి ఏ డైరెక్టర్ అయినా అతనితో యాక్షన్ సినిమానే చేయాలనుకుంటాడు కానీ క్లాస్ సినిమా చేయాలనుకోడు. ఇక బాహుబలి లాంటి [more]
ప్రభాస్ బాడీ అండ్ ఆ కటౌట్ చూసి ఏ డైరెక్టర్ అయినా అతనితో యాక్షన్ సినిమానే చేయాలనుకుంటాడు కానీ క్లాస్ సినిమా చేయాలనుకోడు. ఇక బాహుబలి లాంటి [more]
ప్రభాస్ బాడీ అండ్ ఆ కటౌట్ చూసి ఏ డైరెక్టర్ అయినా అతనితో యాక్షన్ సినిమానే చేయాలనుకుంటాడు కానీ క్లాస్ సినిమా చేయాలనుకోడు. ఇక బాహుబలి లాంటి సినిమా చూసాక ప్రభాస్ నుంచి యాక్షన్ సినిమాలే ఆశించడం సహజం. అందుకే ప్రభాస్ కూడా సాహో లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ప్రభాస్ కి సరిపోయే సినిమా అయింది ఆ సినిమా. అయితే ప్రభాస్ నెక్స్ట్ చేసే సినిమాలో అసలు ఫైట్స్ ఉండవు అని తన స్నేహితుడు గోపీచంద్ చెప్పే మాటలను బట్టి అర్ధం అవవుతుంది.
మొత్తం ప్రేమకథే…..
ఓ ఇంటర్వ్యూ లో గోపీచంద్ ని మీరు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి మరి అందులో నిజం ఎంతుంది? అని అడిగిన ప్రశ్నకు ఆయన… “అలాంటిదేమీ లేదన్నాడు. అసలు ప్రభాస్ చేసే సినిమాలో ఫైట్లకు అవకాశమే లేదని, అది పూర్తి స్థాయి ప్రేమకథ అని.. అందులో విలన్ల పాత్రలకు స్కోపే లేదని.. ఫైట్లు గట్రా ఏమీ ఉండవని.. అలాంటపుడు తాను అందులో విలన్ పాత్ర ఎలా చేస్తానని” అన్నాడు గోపీ. ఒకవేళ ఈ వార్తే నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంతవరకు నిరాశే. ఎందుకంటే ప్రభాస్ నుంచి తన ఫ్యాన్స్ మాస్ ఎలెమెంట్స్ తో పాటు యాక్షన్ అండ్ ఫైట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. మరి రాధా కృష్ణ తో చేసే సినిమాలో ఫైట్స్ లేకపోతే దాని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.