Tue Dec 24 2024 01:38:57 GMT+0000 (Coordinated Universal Time)
పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ అరెస్ట్
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సుదర్శన్ థియేటర్ లో యోగి సినిమా రీ రిలీజ్ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్
ఈ శుక్రవారం ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా రీరిలీజ్ అయింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సుదర్శన్ థియేటర్ లో యోగి సినిమా రీ రిలీజ్ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. యోగి సినిమా సుదర్శన్ థియేటర్లో రీ రిలీజ్ అయింది. ఈ క్రమంలో వివాదం చోటు చేసుకోవడంతో స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు అభిమానులు. థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో ఫ్యాన్స్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ వద్దకు వెళ్లొద్దు అని సెక్యూరిటీ చెప్పడంతో తాగేసి వచ్చి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇష్టమొచ్చినట్లు వస్తువులను పగులగొట్టారని చెబుతున్నారు.
ఏపీలో రెండు చోట్ల థియేటర్లను ధ్వంసం చేశారు. నంద్యాలలోని రాజ్ థియేటర్‌తో పాటు కాకినాడలోని శ్రీప్రియ థియేటర్లో అభిమానులు స్క్రీన్లను చించివేశారు. సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో అభిమానులు స్క్రీన్ మీద పడటంతో రెండు చోట్ల డ్యామేజ్ జరిగింది. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను ఇటీవలే ఆధునీకరణ చేశారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల పని వల్ల ఇకపై థియేటర్లో రీ రిలీజ్ సినిమాలను ప్రదర్శించబోమని యాజమాన్యం తేల్చి చెప్పేసింది. నంద్యాల రాజ్ థియేటర్ యాజమాన్యం కూడా తాజా ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానులు సినిమా చూసేందుకు వచ్చి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని మండిపడింది.
Next Story