Mon Dec 23 2024 05:36:57 GMT+0000 (Coordinated Universal Time)
రాధేశ్యామ్ థియేటర్ వద్ద అపశృతి
ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. ప్రీమియర్ షో లతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సాహో తర్వాత..
గుంటూరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. ప్రీమియర్ షో లతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. సాహో తర్వాత.. దాదాపు నాలుగేళ్లకు విడుదలైన సినిమా కావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందోత్సాహాలకు అంతులేదు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, వాటికి గజమాలలు వేసి, బాణ సంచా పేల్చారు.
కాగా.. సినిమా విడుదల రోజే గుంటూరు జిల్లాలోని కారంపూడిలో ఐమాక్స్ థియేటర్ వద్ద అపశృతి జరిగింది. సినిమా విడుదల సందర్భంగా చల్లా కోటేశ్వరరావు (37) అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా.. అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. దానిని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్ షాక్ కు గురై.. తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా.. వారందరినీ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Next Story