Fri Dec 20 2024 17:33:11 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ తండ్రిగా ఎవరు నటిస్తున్నారు..?
సలార్ తండ్రిగా ఎవరు నటిస్తున్నారు..? 'ఖాన్సార్' రాజ్యానికి మొదటి రాజు దేవ తండ్రి ‘ధార’ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు..?
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెండు పార్టులుగా తెరకెక్కిన 'సలార్' ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 'ఖాన్సార్' అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు కుటుంబాల మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక కుటుంబానికి చెందిన జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి, జాన్ విజయ్, బ్రహ్మాజీ, బాబీ సింహ.. ఇలా దాదాపు అన్ని పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
కానీ ప్రభాస్ పోషించిన దేవ పాత్రకి తండ్రి ఎవరు అన్నది మాత్రం రివీల్ చేయలేదు. అసలు 'ఖాన్సార్' అనే రాజ్యానికి మొదటి రాజు దేవ తండ్రి ‘ధార’. అయితే ‘ధార’ని మన్నార్ (జగపతిబాబు) కుటుంబం చంపేస్తారు. సలార్ మొదటి భాగం చివరిలో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ధారా పాత్రని వెనక్కి నుంచి మాత్రమే చూపించారు. దీంతో ఇప్పుడు ఆ ముఖ్యమైన రోల్ ని ఎవరు పోషించారు అని అందరిలో క్యూరియాసిటీ నెలకుంది.
మూవీ టీం సైతం ఈ పాయింట్నే ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ కూడా వేశారు. ఇక దీనికి అభిమానులు రియాక్ట్ అవుతూ ఆ పాత్రని ప్రభాసే చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొదటిలో ప్రభాస్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ని మూవీ టీం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిక్స్ లో ప్రభాస్ మెలితిప్పిన మీసంతో, మెరిసిన జుట్టుతో కొంచెం ఓల్డ్ లుక్ లో కనిపించారు. అంతేకాదు సలార్ పార్ట్ 1 ఎండ్ క్రెడిట్స్ లో కూడా ప్రభాస్ ని మెలితిప్పిన మీసంతోనే చూపించారు.
ఇక ఇవన్నీ చూపిస్తూ.. తండ్రి పాత్రని కూడా ప్రభాసే పోషిస్తున్నాడని చెబుతున్నారు. మరి ఆ పాత్రని ఎవరు పోషిస్తున్నారో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ అర్ధంకాక ఫ్యాన్స్ కన్ఫ్యుజ్ అయ్యిపోతున్నారు. ఒకవేళ మీకు సలార్ లోని క్యారెక్టర్స్ కనెక్షన్స్ అర్థంకాలేదా..? అయితే ఈ వీడియో చూసేయండి ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
Next Story