ప్రభాస్ కొత్త లుక్ ఏ సినిమా కోసం..?
బాహుబలి ముందు ప్రభాస్ వేరు. భాహుబలి తరువాత ప్రభాస్ వేరు. ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ అందుకు తగట్టు సినిమాలను ఎంచుకుంటున్నాడు. [more]
బాహుబలి ముందు ప్రభాస్ వేరు. భాహుబలి తరువాత ప్రభాస్ వేరు. ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ అందుకు తగట్టు సినిమాలను ఎంచుకుంటున్నాడు. [more]
బాహుబలి ముందు ప్రభాస్ వేరు. భాహుబలి తరువాత ప్రభాస్ వేరు. ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ అందుకు తగట్టు సినిమాలను ఎంచుకుంటున్నాడు. యూనివర్సల్ అప్పీల్ ఉండే కథలనే ఎంచుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’లో చూశాం. ఇందులో వీడియో లాస్ట్ లో ప్రభాస్ లెథర్ జాకెట్ వేసుకుని కూలింగ్ గ్లాసెస్ తో అలా నడుచుకుంటూ వస్తుంటే ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫస్ట్ లుక్ కే ఇంత రెస్పాన్స్ ఉంటే రీసెంట్ గా ఇంకో లుక్ తో ప్రభాస్ తన ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేసాడు.
ఆ లుక్ ఏ సినిమాది…
అయితే ఈసారి మీసాలు, గడ్డం తీసేసి ఫుల్ షేవ్ తో హెయిర్ కూడా కొద్దిగా పెంచి సైడ్ కు దువ్వడంతో కొత్తగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో కన్నా ప్రభాస్ ఇందులో చాలా బాగున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. నిన్న కృష్ణంరాజు బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ కొత్త లుక్ బయటపడింది. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇది ‘సాహో’ లుక్కేనా లేదా రాధాకృష్ణ కుమార్ సినిమా కోసం మార్చిన జిల్ జిల్ లుక్కా అనేది తెలియాల్సి ఉంది.