Fri Dec 20 2024 12:37:01 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD: ఆ సెంటిమెంట్ డేట్‌నే రిలీజ్‌కి ఫిక్స్ చేసుకున్న కల్కి..
ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన కల్కి పోస్టుపోన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆ సెంటిమెంట్ డేట్‌నే
Kalki 2898 AD : ప్రభాస్ ని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కల్కి 2898 AD'. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే, దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ పతాకం పై సి అశ్వినీ దత్ ఈ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కాగా ఈ మూవీ ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ VFX వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో మూవీని పోస్టుపోన్ చేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఆ కొత్త డేట్ ని పండుగ కానుకగా అనౌన్స్ చేయబోతున్నారట. ఈ మూవీ రిలీజ్ కోసం వైజయంతి మూవీస్ బ్యానర్ కి కలిసొచ్చిన ఆ సెంటిమెంట్ డేట్‌నే ఫిక్స్ చేసుకున్నారట. ఇంతకీ ఆ సెంటిమెంట్ తేదీ ఏంటి..?
ఈ ఏడాది వేసవిలో మే 9న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారట. గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మహానటి' సినిమాలు.. ఆ తేదిలోనే విడుదలయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు వైజయంతి మూవీస్ బ్యానర్లోనే కాదు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు అలాంటి తేదీకి కల్కిని తీసుకు రావడం పాజిటివ్ గా కనిపిస్తుంది.
ఇక ఈ కొత్త రిలీజ్ డేట్ తో పాటు కొత్త పోస్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ మూవీలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారట. టైం ట్రావెల్, రోబోటిక్ సూట్స్, సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో ఫ్యూచర్ టెక్నాలజీలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, కాస్ట్యూమ్స్.. ఇలా అన్నిటిని కూడా భారతీయ మూలాలతో కొత్తగా డిజైన్ చేస్తున్నారు. మూవీలోని ప్రతి విషయం కొత్త కనిపించాలని స్క్రాప్ ద్వారా ఒక కొత్త ఊహా ప్రపంచాన్ని, కొత్త పరికరాలను సృష్టిస్తున్నారు.
Next Story