Mon Dec 23 2024 01:40:38 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD : ప్రభాస్ 'కల్కి'లో ఉపయోగించే గన్స్ తయారీ వీడియో చూశారా
ప్రభాస్ 'కల్కి'లో ఉపయోగించే గన్స్ తయారీ వీడియోని మీరు చూశారా..? ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో చూసిన వాటికంటే కొత్తగా..
Kalki 2898 AD : ప్రభాస్ ని సూపర్ హీరో సూట్లో చూపిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ మూవీ 'కల్కి 2898 AD'. టైం ట్రావెల్, రోబోటిక్ సూట్స్, సూపర్ హీరోస్ వంటి కథనాలు.. ఇన్నాళ్లు హాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ మూవీస్ లోనే చూశాము. ఇప్పుడు కల్కి ద్వారా ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ ఎలా ఉండబోతుందో చూడబోతున్నారు.
భవిష్యత్తు ప్రపంచంలో ఇండియన్ సిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూపిస్తూ.. హిందూ పురాణ కథలను ఆధారంగా తీసుకోని ఒక అద్భుతమైన సినిమాని రెడీ చేస్తున్నారు కల్కి మేకర్స్. ఫ్యూచర్ టెక్నాలజీలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, కాస్ట్యూమ్స్.. ఇలా అన్నిటిని కూడా భారతీయ మూలాలతోనే డిజైన్ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే మూవీ టీం ఇక్కడ మరో జాగ్రత్త కూడా తీసుకుంటుంది. మూవీలోని ప్రతి విషయం కొత్త కనిపించాలని స్క్రాప్ ద్వారా ఒక కొత్త ఊహా ప్రపంచాన్ని, కొత్త పరికరాలను సృష్టిస్తున్నారు.
ఈక్రమంలోనే కల్కిలో ఉపయోగించే గన్స్ ని కొత్తగా డిజైన్ చేయించారు. ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో చూసిన వాటికంటే.. కొత్తగా ఈ గన్స్ కనిపించబోతున్నారు. సినిమాలో వాటి ఆపరేషన్ కూడా ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ని ఇవ్వబోతుందట. ఇక మూవీ కోసం ఈ గన్స్ ని తయారు చేసిన వీడియోని.. న్యూ ఇయర్ బహుమతిగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఆ గన్స్ తయారీ వీడియోని మీరు కూడా చూసేయండి.
Next Story