Fri Dec 20 2024 12:07:10 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD Teaser : కల్కి రిలీజ్ డేట్ అప్డేట్తో పాటు టీజర్ కూడా..
కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని టీజర్ తో ఇచ్చి ప్రభాస్ అభిమానులను మేకర్స్ సర్ప్రైజ్ చేయబోతున్నారట.
Kalki 2898 AD Teaser : హాలీవుడ్ ఫ్యూచరిస్టిక్ మూవీస్ మాదిరి టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. హిందూ పురాణ కథల ఆధారంగా తీసుకోని ఒక అద్భుతమైన సినిమాని మోడరన్ టెక్నాలజీ హంగులతో రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. విష్ణుమూర్తి దశావతారం అయిన కల్కిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.
కాగా ఈ మూవీ ఈ సంక్రాంతికే రిలీజ్ చేస్తామంటూ గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ అండ్ గ్రాఫిక్ వర్క్స్ లేట్ అవ్వడంతో పోస్టుపోన్ చేశారు. ఇప్పుడు ఓ కొత్త రిలీజ్ డేట్ ని పండుగ కానుకగా అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్కి టీజర్‌కి సంబంధించిన సర్టిఫికేషన్ పేపర్ వైరల్ అవుతుంది.
ఆ టీజర్ 1 నిమిషం 23 సెకెన్ల నిడివితో ఉండబోతుందని ఆ సర్టిఫికెట్ లో తెలుస్తుంది. అయితే టీజర్ గురించిన అప్డేట్ అయితే మూవీ టీం ఏం ఇవ్వలేదు. రిలీజ్ డేట్ అనౌన్స్ కి మాత్రం ఒక టైమర్ ఫిక్స్ చేసింది. ఆ టైమర్ బట్టి చూస్తే.. జనవరి 13న రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని టీజర్ తో ఇచ్చి ప్రభాస్ అభిమానులను సర్ప్రైజ్ చేయబోతున్నారట. కాగా ఈ మూవీని ఈ ఏడాది వేసవిలో మే 9న రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారట.
గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మహానటి' సినిమాలు.. ఆ తేదిలోనే విడుదలయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు వైజయంతి మూవీస్ బ్యానర్లోనే కాదు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక ప్రత్యేక చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు అలాంటి తేదీకి కల్కిని తీసుకు రావడం పాజిటివ్ గా కనిపిస్తుంది.
Next Story