Mon Dec 23 2024 12:16:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ ‘కల్కి’ నిర్మాతల స్ట్రాంగ్ వార్నింగ్..
ప్రభాస్ ‘కల్కి’ నిర్మాతలు అలా చేసే వారికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
బడా హీరోల క్రేజీ ప్రాజెక్ట్ల పై ఉన్న బజ్ కారణంగా మేకర్స్.. ఆ సినిమా సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా గౌప్యంగా ఉంచుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మూవీ సెట్స్ నుంచి ఏదోకటి ఏదో విధంగా లీక్ అవుతూ ఉంటాయి. ఇక ఇటీవల ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సూపర్ హీరో మూవీ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది.
కల్కి కోసం VFX వర్క్ చేస్తున్న కంపెనీ నుంచే ఆ ఫోటో లీక్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు చాలా సీరియస్ అయ్యారు. ఆ VFX టీం పై పోలీస్ కేసు ఫైల్ చేసి వారిపై లీగల్ యాక్షన్ తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి లీక్ అయిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం, ఆ పిక్ ని చాలామంది నెటిజెన్స్ రీ షేర్లు చేస్తూ వచ్చారు. ఇక ఇలా రీ షేర్లు చేసే వారికీ కూడా నిర్మాతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
"సినిమాకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, లేదా సెట్స్ కి సంబంధించిన ఫ్యూటేజ్ వంటివి.. ఎవరన్నా సోషల్ మీడియాలో షేర్ చేయడం, లీక్ చేయడం చేస్తే వారి పై లీగల్ గా కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ వ్యక్తి ఎవరైనా సరే 1957 యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాము" అంటూ వెల్లడిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మూవీ ఇలా యాక్షన్ తీసుకోవడంతో ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నాడు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తుండడం విశేషం. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్, దిశా పటాని ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో మరికొంతమంది స్టార్స్ కూడా కనిపించబోతున్నారట. సి అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని వైజయంతి మూవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Next Story