Mon Dec 23 2024 07:05:30 GMT+0000 (Coordinated Universal Time)
రిలీజ్ కు ముందే ఓటీటీ పార్ట్ నర్ లాక్ చేసుకున్న ఆదిపురుష్
రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందుకే చినజీయర్ స్వామే గెస్టుగా వస్తే బాగుంటుందని..
తిరుమల వెంకన్న సాక్షిగా.. నేడు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈరోజు (జూన్6) సాయంత్రం జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు.. ఇప్పటి వరకూ ఏ సినిమాకు గెస్ట్ గా రాని శ్రీ తిదిండి చినజీయర్ స్వామి విచ్చేస్తున్నారు. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందుకే చినజీయర్ స్వామే గెస్టుగా వస్తే బాగుంటుందని ఆదిపురుష్ చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిన్న రాత్రే తిరుమలకు చేరుకున్న ప్రభాస్.. శ్రీవారిని దర్శించుకుని, ఆయన సేవలో పాల్గొన్నారు. బాహుబలి సెంటిమెంట్ తో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే తిరుపతి మొత్తం ఆదిపురుష్ మేనియా స్టార్ట్ అయింది. ఆకాశమే హద్దుగా ప్రీ రిలీజ్ వేడుకలకు అభిమానులు సిద్ధమవుతున్నారు. జై శ్రీరామ్ అనే నినాదంతో తిరుపతి మారుమ్రోగనుంది. తాజాగా.. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తికర విషయం తెరపైకొచ్చింది. ఓం రౌత్ డైరెక్షన్లో … మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా.. జూన్ 16న థియేటర్లలోకి రానుంది. విడుదలకు ముందే ఆదిపురుష్ ఓటీటీ పార్ట్ నర్ ను మ్యాజిక్ ఫిగర్ కు లాక్ చేసుకుందని బీ టౌన్ లో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే నాన్ థియేటర్ అండ్ థియేటర్ రైట్స్‌లో ఆదిపురుష్ దాదాపు రూ.432 కోట్లకు పైగా వసూళ్లు చేసిందన్న టాక్ ఉండగా.. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి.. దాదాపు రూ.250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కు అమ్మినట్లు సమాచారం. బీ టౌన్ లో ఇప్పుడిదే హాట్ న్యూస్.
Next Story