Tue Dec 24 2024 12:53:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ లుక్స్ లీక్.. పట్టించిన వారిని 5 లక్షలు
మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాలో
మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని వివాదాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అప్పట్లో టీజర్ మీద విమర్శలు చేసినందుకు తమకు స్ట్రైక్స్ వేస్తున్నారంటూ పలు యూట్యూబర్లు ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత కూడా కొందరు సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఆ వివాదాలు సమిసిపోయాయని అనుకునే లోపే మరో వివాదం నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అతని పాత్ర గురించి పెద్దగా ఏమీ తెలియనప్పటికీ, అతని లుక్ ఇటీవల X లో లీక్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇతరులతో పంచుకోవద్దని అభిమానులను కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ లీక్ చేసిన వ్యక్తిని పట్టుకోవడంలో సహాయం చేసిన వారికి బహుమతిని కూడా ఇస్తామని తెలిపింది.
"కన్నప్ప టీమ్ నుంచి అత్యవసర, హృదయపూర్వక విజ్ఞప్తి ప్రియమైన ప్రభాస్ అభిమానులు, అందరి కథానాయకుల అభిమానులను కోరుతున్నది ఏమనగా.... కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా హృదయాలను, ప్రాణాలను అర్పించాము. రెండు సంవత్సరాల నిబద్ధతతో ఈ ప్రాజెక్టను పూర్తి చేయడానికి మా టీమ్ నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి క్షణంలో కన్నప్ప సినిమా నుంచి ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇమేజ్ అనధికారంగా లీక్ అయినందుకు చాలా చింతిస్తున్నాము. ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా, ఈ ప్రాజెక్ట్లపై నిరంతరం కృషి చేస్తున్న 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ లీక్ ఎలా జరిగింది అనేది కనుగొనేందుకు మేము పోలీస్ కేసు పెట్టడం జరుగుతోంది. ఈ లీక్ అయిన ఇమేజ్ పుటేజీను ఎవరైనా షేర్ చేస్తూ ఉంటే, ఆ దొంగల్ని పెట్టుకోమని అభిమానులందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈలీక్ చేసిన వారిని ఎవరైనా కనుగొంటే, వారికి 5,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాం. సమాచారం తెలిసిన వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్విట్టర్ అకౌంట్ కు మెసేజ్ పంపండి అని ప్రార్ధిస్తున్నాము. " అంటూ కన్నప్ప టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
Next Story